గడీల పాలన అంతం చేసి, బహుజన రాజ్యస్థాపన మా లక్ష్యం

బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తెలంగాణలో విద్య వైద్యం ఉపాధి మా లక్ష్యం.
తెలంగాణలో టిఆర్ఎస్ మాకు ప్రధాన శత్రువు.
నియోజవర్గంలో కొనసాగుతున్న ఇసుక దందా, భూకబ్జాలు రాజ్యమేలుతున్నాయి.
తెలంగాణలో రెండు కోట్ల మంది ప్రజలను నేరుగా కలవనున్నట్లు పేర్కొన్నారు.
నిరుద్యోగులు కెసిఆర్ మాయమాటలు నమ్మరు.
తెలంగాణలో ముందుకు వెళ్ళని డబుల్ బెడ్ రూమ్ పథకం. తెలంగాణ ప్రజలంతా నిరాశ చెందుతున్నారు.
సూర్యాపేట, డిసెంబర్ 19 ,నిజం న్యూస్
తెలంగాణ లో కొనసాగుతున్న గడిల పాలనను అంతం చేసి, బహుజన సామ్రాజ్యం కోసం పోరాటమే మా లక్ష్యం అని బి ఎస్ పి చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
శనివారం మండలంలోని వెలుగు పల్లి, తుంగతుర్తి, అన్నారం, వెంపటి, రావులపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బీఎస్పీ ఆధ్వర్యంలో, పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల అభివృద్ధికి కెసిఆర్ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్య వైద్యం ఉపాధి లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పూర్తిగా గడీల పాలన జరుగుతూ, ఇస్తా రాజ్యముగా నిధులు ఖర్చులు చేస్తూ, సామాన్య ప్రజలకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు
. దొరల పాలనలో కాంట్రాక్టర్లు, మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వరం గా మారి, ధనార్జన జరుపుతున్నట్లు దుయ్యబట్టారు. తెలంగాణలో పూర్తిగా కెసిఆర్ ను ప్రజలు విస్మరిస్తున్న ట్లు తెలిపారు. తెలంగాణ లో డబల్ బెడ్ రూమ్ పథకం పేదలకు అందని ద్రాక్షగా మారిందని ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని అన్నారు. తెలంగాణ లో కెసిఆర్ ప్రాజెక్టులో కమీషన్ కోసమే పనులు చేపట్టారని, మూడు సంవత్సరాలు గడిచిన నేటికి పించన్లు అందక గ్రామాల్లో వృద్ధులు దీన స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్న అప్పటికి, అధికార పార్టీ నాయకుల చెప్పుచేతల్లో కీలుబొమ్మగా మారిన అని విమర్శించారు.
ప్రస్తుతం రెండు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్నట్లు, రానున్న రోజుల్లో 33 జిల్లాలో పాదయాత్ర చేస్తూ నేరుగా రెండు కోట్ల మందిని కలుస్తూ ప్రజాసమస్యలను తెలుసుకో నట్లు తెలిపారు.
నియోజవర్గంలో పూర్తిగా అభివృద్ధిని వి స్మరించి ఇసుక దందా, భూకబ్జాలకు నిలయం గా మారినట్లు ఆరోపించారు. దళితులపై దాడులు చేస్తున్న ప్రతినిధులు విస్మరించడం సిగ్గుచేటని అన్నారు.
బిఎస్పీ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం నింపి మార్పును తీసుకుని వచ్చి ప్రజల అభీష్టం మేరకే నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్టు తెలిపారు.
తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి పొత్తులు ఉంటాయో తెలియదు కానీ, బి ఎస్ పి ఏ పార్టీతో పొత్తు లేదని, ఒంటరి పోరాటం చేస్తూ, బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయడమే మా అంతిమ లక్ష్యం అని పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం నుండి తమ పార్టీ అభ్యర్థి పోటీలో నిల పడతారని, తాము ఎవరికీ డబ్బు మందు, పంపిణీ చేయమని, యువత ,ప్రజల్లో చైతన్యం నింపి, ఓటు అనే ఆయుధాన్ని , సాధించ నున్నట్లు , గ్రామాల్లో ప్రజలు ఆశీర్వదిస్తారని, ఆశాభావం వ్యక్తం చేశారు.