కొలిక్కి వస్తున్న సాగర్ కాలువలో పడ్డ కారు కథ.

*కారు కాలువలో పడేసింది అన్నాచెల్లెళ్ళే.
-వారుకూడా చావాలనుకున్నారా.!
మిర్యాలగూడ మార్చి 19.(నిజంన్యూస్): నల్గొండ జిల్లా వేములపల్లి మండల సమీపంలోనిసాగర్ కెనాల్ లో అనుమానాస్పదంగా కొట్టుక వచ్చిన ఖాళీ కారు పై కొనసాగుతున్న సస్పెన్స్..
తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ పి. రామాంజనేయులు కుటుంబ సభ్యుల కారు గా గుర్తింపు
పార్కింగ్ చేసిన కారు పోయిందని మిర్యాలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
**కారులో లగేజ్ తీసుకున్న ఓ జంట.. కారును కెనాల్ లోకి తోసినట్టుగా అనుమానం.
**రామాంజనేయులు కు ఇద్దరు కుమారులు ఒక కూతురు.*..
**గత కొంతకాలంగా కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు*…
**తల్లిదండ్రులతో విభేదించి వారికి దూరంగా మిర్యాలగూడ మండలం అవంతిపురం లో నివాసం ఉంటున్నా కూతురు విగ్నేశ్వర. కుమారుడు మల్లికార్జున్.
తమను ఆదరించటం లేదంటూ గతంలో నల్గొండ పరిధిలోని పీఎస్ లో ఫిర్యాదు చేసిన కూతురు కుమారుడు.
గత కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతూ చర్చిల చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేస్తున్నట్లు సమాచారం..
**నీటమునిగిన కారును వెలికి తీసే పనిలో ఉన్న పోలీసులు..
కారును కాలువలోకి నెట్టి,వారు కూడా కాలువలోకి దూకానుకున్నారా.!
కారును మాత్రమే కాలువలోకి నెట్టి వారి ఆగిపోయారని వినికిడి.
ఆ కారులో ఏముంది అనేదే సస్పెన్స్*…
ఈ రోజు పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది.