డ్రైవర్‌కు గుండెపోటు..ట్రాక్టర్ బోల్తా..ఇద్దరు కూలీలు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 18 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిన్నంబావి వద్ద విషాదం నెలకొంది. ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్య సహా ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన కూలీలను ఆంధ్రప్రదేశ్ వాసులైన సీతారం, దుర్గగా పోలీసులు గుర్తించారు. శేరిగూడెంలో ఇటుకలు దింపి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.