అమేథీలో హోలీ వేడుకల్లో ఘర్షణ… ఇద్దరు మృతి ఆరుగురికి గాయాలు.

అమేథీ లోని ఒక గ్రామంలో శుక్రవారం హోలీ వేడుకలు జరుపుకునే విషయంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అఖండ్ ప్రతాప్ సింగ్ (32), శివరామ్ పాసి (55)గా గుర్తించామని, జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని రెవ్రాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని ఎస్‌హెచ్‌ఓ ధీరేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

ఘర్షణ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ మిశ్రా, పోలీసు సూపరింటెండెంట్ దినేష్ గ్రామానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అఖండ ప్రతాప్ సింగ్‌కు నేర చరిత్ర ఉందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.