యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 17(నిజం న్యూస్)
ఈ నెల 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించబడే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై గురువారం నాడు కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గీత, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, అధికారులతో సమీక్షించారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ ఏర్పాట్లు, మంచినీటి ఏర్పాట్లు, ప్రముఖుల రాక సందర్భంగా ప్రోటోకాల్, బందోబస్తు ఏర్పాట్లు, అగ్నిమాపక వ్యవస్థ, వైద్య శిబిరాలు, ఆర్టీసీ బస్సుల సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, పార్కింగ్, వసతి, తదితర సదుపాయాలపై తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.సమీక్షా కార్యక్రమంలో ట్రాన్స్ కో సూపరింటిండెంట్ ఇంజనీర్ శ్రీనాథ్,జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు,జిల్లా రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్ శంకరయ్య,జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్ కృష్ణ, ట్రాఫిక్, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.