గేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో జాతీయ స్థాయిలో 254 వ ర్యాంక్

గరిడేపల్లి,మార్చి17(నిజం న్యూస్)

ప్రజా పక్షం గేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో కీతవారిగూడెం గ్రామానికి చెందిన గుండు సింధు జాతీయ స్థాయిలో 254 వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరించింది. కీతవారిగూడెం గ్రామానికి చెందిన గుండు సైదయ్య నాగమణి ల కుమార్తె సింధు 10 వ తరగతి వరకు కోదాడ వైష్ణవి స్కూల్ లో, ఇంటర్ హైదరాబాద్ లోని నారాయణ కాలేజీ లో చదివింది. బీటెక్ సి‌బి‌ఐ‌టి లో చదివింది. తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు కావడంతో ఇద్దరు కూతుర్లను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే పట్టుదలతో వ్యవసాయం చేస్తూ కూతుర్లను చదివించారు. ఇటీవల సింధు కి చిలుకూరు మండలం మాధవగూడెం గ్రామానికి చెందిన శోభన్ బాబుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా భర్త ప్రోత్సహించడంతో గేట్ ఎంట్రన్స్ కి కష్టపడి చదివి ర్యాంక్ ను సాదించింది. సింధు ర్యాంక్ సాధించడం పట్ల పుట్టిన ఊరికి, మెట్టిన ఊరికి పేరుప్రఖ్యాతలు తీసుకువచ్చిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.