Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏండ్లు గడుస్తున్నా… వీళ్లకు నో బదిలీ

రాజన్న సిరిసిల్ల, మార్చి16 (నిజం న్యూస్):

సెస్ విచారణలో బాగంగా బుదవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ కి కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందించిన బిజెపి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెస్ లో ఎన్నో బదిలీలు జరుగుతున్నా ఏఏ‌ఓ రాజేందర్, ఎఎఒ బారి లు 17 సంవత్సరాలుగా ఒకే సెక్షన్లో విధులు నిర్వహిస్తు, స్టాఫ్ పై అజమాయిషీ చెలాయిస్తు, వారికి ప్రోమోషన్లు, ట్రాన్స్ఫర్లు చేస్తామని వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూ సెస్ కి చెడ్డ పేరు తెస్తున్నారని, ఏండ్ల నుండి వీరికి ఎటువంటి బదిలీలు లేవు, వీరు నామినేట్ వర్క్స్ లో వీరి బినామీ కాంట్రాక్ట్ లచే చేయించడం, వీరికి సంబందించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే ఇవ్వబడదని లెటర్స్ ఇస్తున్నారని, వారు నిర్వహిస్తున్న అకౌంట్స్, ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ లలోని సమాచారం తర్డ్ పర్సన్సికి ఇవ్వబడదని లెటర్ ఇచ్చారని, ఇలా సమాచార హక్కు చట్టాన్ని కూడా లెక్కచేయకుండా దానిని నిర్విర్యం చేస్తూ వీరు అధికార దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.

సెస్ లో జెఏ‌ఓ రవి అనే వ్యక్తి కీలకమైన ఆన్లైన్ విబాగంలో ఏళ్లతరబడి పని చేస్తూ అక్రమాలు చేస్తూ, వినియోగదారులకు బిల్లులు రూపంలో తగ్గిస్తూ వసూళ్ల పరంపర కొనసాగిస్తు, కోట్ల రూపాయల ఆస్తులు ఇతని పేరు పై ఉన్నాయని, గతంలో అవినీతికి పాల్పడి ఏసిబి కి కూడా పట్టుబడ్డాడని పేర్కొన్నారు.

సెస్ లో ఇటీవల జరిగిన కాంట్రాక్ట్ వర్క్స్ లలో సెస్ కార్యలయం షిఫ్టింగ్, ఆఫీస్ ఫర్నిచర్ కొనుగోలు లో అవినీతి జరిగిందని అనేక న్యూస్ చానల్ లల్లో, పేపర్లలో ప్రచురితం అయిందని అన్నారు.

సెస్ ఆఫీసు కి సంబంధించి అన్నీ వ్యవహారాలపై ఒక కలెక్టర్ స్థాయి అదికారితో పూర్తి స్థాయి విచారణ జరిపించి బద్యులపై వెంటనే చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడ్డ ఏఏ‌ఓ రాజేందర్, బారి, జెఏ‌ఓ రవి లను సస్పెండ్ చేసి, క్రిమినల్ కేస్ నమోధు చేయాలని బిజెపి పక్షాన డిమాండ్ చేశారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు రియాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరస్వాల్ కైలాష్, బిజెవైఎం నాయకులు సాయికృష, దావీదు లు ఉన్నారు.