మురికి కాలువలో పసికందు మృతదేహం

– మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు
నిజామాబాద్ క్రైమ్ బ్యూరో, మార్చి16 (నిజం న్యూస్): నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్,భాగ్యనగర్ లోని మురికి కాలువలో మగశిశువు పసికందు మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు ఇట్టి విషయాన్ని అంగన్వాడీ టీచర్ ప్రతిభకు స్థానికులు సమాచారం అందించగా ఆమె హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు అనంతరం రూరల్ ఎస్సై లింబాద్రి ఘటనాస్థలానికి చేరుకుని మగశిశువు పసికందు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎవరు పారేసి ఉంటారు శిశువు మృతికి గల కారణాలు ఏమిటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మీడియాకు తెలిపారు