శీలానికి వెల కట్టిన పెద్దమనుషులు
పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన టీఆర్ఎస్ నేత డ్రైవర్.
పరిహారంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఊరి దొర తీర్పు
మనస్తాపం తో యువతి ఆత్మహత్య…
మహబూబాద్ జిల్లా పెద్దముప్పారంలో ఘటన
మహబూబాద్ , మార్చి 16 ,నిజం న్యూస్.
పల్లెల్లో పెద్దమనుషుల తీర్పులు అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి..
. ఓ వైపు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తెస్తున్నా.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతో కొందరు చోటా మోటా లీడర్లు బరితెగిస్తున్నారు…
పంచాయితీ పెద్ద మనుషుల తీర్పు, అధికార పార్టీ యువనేత కామానికి ఓ యువతి బలైన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పెద్ద ముప్పారం గ్రామంలో చోటు చేసుకుంది…
పెద్దముప్పారం గ్రామానికి చెందిన కొండ లింగమల్లు దంతాలపల్లి మండల టీ ఆర్ ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శిగా, మహబూబాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో నే అతడు అదే గ్రామానికి చెందిన మహిళ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికవాంఛ తీర్చుకుని ముఖం చాటేశాడు. నాలుగేళ్లుగా లైంగికంగా వాడుకుని తీరా పెళ్లికి ఒప్పుకోక పోవడంతో బాధిత యువతి తన తల్లిదండ్రులతో కలిసి అదే గ్రామానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ ఆశ్రయించింది…
సదరు యువకుడికి బుద్ధి చెప్పి యువతికి న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులు ఆమె శీలానికి వెల కట్టారు…
గత నెల రెండో వారంలో లింగమల్లు రూ.2 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చారు. తనకు డబ్బులు వద్దని, లింగమల్లునే పెళ్లి చేసుకుంటానని బాధితురాలు ఎంత చెప్పినా పెద్ద మనుషులు వినలేదు….
ఈ క్రమం లోనే ఇటీవల గడీలో పంచాయితీ పెట్టి పెళ్లి కి ఆర్నెళ్ల గడువు విధించారు. పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే వెంటనే చేయాలని, కానీ సదరు యువకుడిని కాపాడేందుకే ఇలా చేస్తున్నారని, తనకు అన్యాయం చేశారని ఆవేదన కు గురైన శరణ్య మంగళ వారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది…
చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఈ ఘటనతో ఊరంతా తరలి వచ్చి యువతి శవాన్ని యువకుడి ఇంటి ముందు ధర్నా చేశారు…
ప్రేమించి మోసగించిన లింగమల్లును, పంచాయతీ చేసిన పెద్దమనుషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున పోలీస్ లు పెద్ద ఎత్తున చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు…
అర్ధరాత్రి యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటన అబ్బాయి పూర్తిస్థాయిలో జిల్లా ఎస్పీ విచారణ జరిపించి , బాధితుని పై క్రిమినల్ కేసు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ,గ్రామస్తులు ,కుటుంబ సభ్యులు కోరుతున్నారు.