చిన్న జీయర్ స్వామి…. కబడ్ధార్

చిన్న జీయర్ స్వామి…. కబడ్ధార్!
సమ్మక్క సారలమ్మ ల వనదేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ములుగు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్. సీతక్క.
హైదరాబాద్, మార్చి 16 ,నిజం న్యూస్
ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నావ్ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
మా తల్లుల ది వ్యాపారమా, మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు టికెట్ ధర పెట్టారు మీది బిజినెస్ మా సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు..
లక్ష రూపాయల తీసుకోకుండా ఏదైనా పేద వారి ఇంటికి మీరు వెళ్ళారా ? అని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయినా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి , లేనియెడల ఆదివాసుల ఆగ్రహానికి గురికాక తప్పదని, ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.