విద్యుత్తు షాక్ తో హమాలీ మృతి

వరంగల్, మార్చి15 (నిజం న్యూస్):
నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో హమాలిగా పని చేసే పనికర గ్రామానికి చెందిన మూల సంజీవ మంగళవారం ఉదయం మార్కెట్లో మొక్కజొన్నా బస్తాలు లోడు చేసే సమయంలో పైన ఉన్న విద్యుత్తు మెయిన్ లైన్ తగిలి అక్కడికి అక్కడే మృతి చెందాడు. కూలి మరణానికి మార్కెట్ కమిటీ యాజమాన్యం స్పందించకపోవడం తో మృతిని కుటుంబ సభ్యులు వ్యవసాయ మార్కెట్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.