ఆదుకోండి మంత్రి గారు..ప్లీజ్
కరెంట్ బిల్ తెచ్చిన పక్షవాతం

ఆమెకు పుట్టుకతో పోలియో
దీన స్థితిలో శ్రీను కుటుంబం
అర్థాకలితో అలమటిస్తున్న పిల్లలు
నలుగురు వెళితే నిలపడటానికి చోటు లేని ఇల్లు
ఆత్మకూరు ఎస్ మార్చి14 (నిజం న్యూస్): అర్థాకలితో అలమటిస్తున్న కుటుం బాన్ని ఆదుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒకే పెన్షన్‌తో నలుగురు జీవనం గడపటానికి నానా కష్టాలు పడుతున్నారు. వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 39వవార్డు సందు బావికి చెందిన కోల శ్రీను మిషన్ మెకానిక్. ఆత్మకూర్(ఎస్)కు చెందిన వినోదతో 2004లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, ఒక బాబు. ఉండటానికి ఇల్లు కూడా సరిగాలేదు.నలుగురు వెలితే నిలబడటానికి చోటు కూడా ఉండదు. వారింట్లో ఒక చిన్న ఫ్యాన్, ఒక బల్బు. వినోద ఎడమ కాలుకు పోలియో. శ్రీను మిషన్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2018లో వీరికి ఒక నెల కరెంట్ బిల్ రూ. 9600 రాగా బీపీ ఎక్కు వ అయి టెన్షన్ తో కుడి కాలు, కుడి చేతికి పక్ష వాతం వచ్చి నాటి నుంచి నేటి వరకు మంచానికే పరిమితమయ్యాడని బాధితులు తెలిపారు. వికలాంగుల సర్టిఫికెట్ తీసుకొని మున్సిపాలిటీలో 2 సంవత్సరాల క్రితం దరఖాస్తు చేయగా నేటి పెన్షన్ రావడం లేదని వాపోతున్నారు. వినోదకు వచ్చే పెన్షన్‌తో భర్త, పిల్లలను సాకుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్ బియ్యంతోనే పూట గడపుతున్నారు. పిల్లలు చరణ్ తేజ 4వ తరగతి, నిత్యశ్రీ 1 వ తరగతి వికాస్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. ఫీజు కట్టేందుకు, మందులు వాడేందుకు, కుటుంబ పోషణకు పెన్షన్ డబ్బులు సరిపోవడం లేదని వినోద ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆర్థిక సాయం చేయదలచిన వారు 9603383074, 9948207525 నంబర్‌లను సంప్రదించగలరు.