ట్రాక్టర్ దొంగతనం లో పాలుపంచుకున్నదెందరో..!

 

వారం గడుస్తున్నా ,విడువని మిస్టరీ.

జరిగిన సంఘటన మండల విలేకరులకు పోలీసులు తెలియజేయ నీ, వైనం.

సామాన్ల పంపకాలలో విభేదాలే, తుంగతుర్తి లో బయటపడ్డ వైనం.

ఈ సంఘటనలో ముగ్గురా, పంచుకున్నది ఆరుగురు రా?

స్థానికంగా లైసెన్సులు లేకుండా జోరుగా పాత ఇనుము వ్యాపారాలు. పట్టించుకోని పోలీసు సిబ్బంది.

సూర్యాపేట, మార్చి 14 ,నిజం న్యూస్

ముగ్గురు వ్యక్తులు కలిసి ట్రాక్టర్లు దొంగిలించి విడి భాగాలుచేసి పాత ఇనువ సామానుకు తుంగతుర్తిలో విక్రయించినట్లు తెలిసింది. ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు తిరుమలగిరి మున్సిపాలటీ అనంతారం గ్రామానికి చెందిన ఒకరు, నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన వ్యక్తి

మరో వ్యక్తి. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ట్రాక్టర్లు దొంగతనం చేసి తుంగతుర్తిలో వ్యవసాయమారె ట్డరెట్ సమీపంలోని పాత ఇనుప సామాను షాప్లో అమ్మినట్లు తెలిసింది. దొంగతనం చేసి ట్రాక్టర్ పనిముట్ల లో కొన్నింటిని తీసుకునే క్రమంలో ముగ్గురి మద్య వచ్చిన పంపకాల విభేదాల వలన పోలీస్ల వద్దకు వెళ్లినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే పాత ఇనుప సామాను వద్దకువెళ్లి చూడగా ఒక కల్గివేటర్ ఉండగా దానిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై తుంగతుర్తి ఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా ట్రాక్టర్ విడిభాగాలు అమ్ముకున్నట్లు సమాచారం తెలియగానే అనంతారం గ్రామానికి చెందిన వరమేష్ ను వర్గమానుకోట గ్రామానికి చెందిన నాగరాజును విచారించగా వర్ధమానుకోటకు చెందిన నాగరాజు కాగితాలులేని ట్రాక్టర్ తానే విక్రయించానని, దాని విడిభాగాలు ఇనుపషాప్లో అమ్మినామని పరమేష్ కు చెప్పాడని ఎస్ఐకి తెలిపారు. నాగరాజు దగ్గర ట్రాక్టర్ కొన్నట్లుసమాచారం తేవాలని ఎస్ఐ చెప్పారు. చుట్టుపక కల నాగారం, అర్యవల్లి, శాలిగౌరారం, తిరుమలగిరి, కొడకండ్ల, తొర్రూర్ పోలీస్ స్టేషన్లలో ట్రాక్టర్లు పోయినవారి సమాచారం ఇవ్వాలని ఆయా స్టేషన్ల పోలీస్లకు సమాచారం తెలపమని ఆయన తెలిపారు.

ఏది ఏమైనా జరిగిన సంఘటనపై తుంగతుర్తి మండల విలేఖర్లకు స్థానిక పోలీసులు కనీసం సమాచారం చెప్పకపోవడం దురదృష్టకరమైన విషయం. జరిగిన సంఘటనపై బాధితులు ఎవరైనా, విచారణ జరిపించి ట్రాక్టర్ దొంగతనం లో బాధ్యులైన వాడిపై కేసు నమోదు చేయాలని, స్థానిక ప్రజలు , వివిధ పార్టీ నాయకులు సూర్యాపేట ఎస్పీని కోరుతున్నారు.