దామరచర్ల లో గొంతుకోసి కిరాతకంగా హత్య

దామరచర్ల: మార్చి 13.(నిజంన్యూస్): దామరచర్ల మండల కేంద్రానికి చెందిన కుర్ర లింగరాజు(35) అనే యువకుడిని రైల్వే ట్రాక్ సమీపం వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హత్య కు గురయ్యారు.

దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు తరలించామని వాడపల్లి ఎస్ ఐ రవి కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.