జాతీయ క్రీడలో పాల్గొంటున్న మెరుగు భాను ప్రకాష్ కు ఫ్రెండ్స్ క్లబ్ అభినందన

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 13 (నిజం న్యూస్)
ఫ్రెండ్స్ క్లబ్ ఆలేరు సభ్యుడైన మెరుగు భాను ప్రకాష్, ఈనెల ఏడవ తారీఖున, ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో వాటర్ స్పోర్ట్స్ (పడవ పందాలు) హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లో జరిగాయి, ఇట్టి పోటీలలో ప్రతిభ ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ క్రీడలకు ఎన్నికైనాడు, ఇట్టి క్రీడలు ఈనెల 14 నుండి 18 వరకు పంజాబ్ లో జరుగు జాతీయ క్రీడ లో పాల్గొంటాడు, గతంలో కూడా విశాఖపట్నంలో జరిగిన టార్గెట్ బాల్ జాతీయ క్రీడ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆదివారం రోజున
ఫ్రెండ్స్ క్లబ్ ఆలేరు అధ్యక్షులు పూల నాగయ్య, ఉపాధ్యక్షులు మంద సోమరాజు, ఆడెపు బాలస్వామి, మొరి గాడి వెంకటేష్, పరిగల రాములు ,
ప్రధాన కార్యదర్శి కళా శిఖకం శ్రీనివాస్, కోశాధికారి మల్లేశం, క్రీడల కార్యదర్శి పాండు సార్, సహాయ కార్యదర్శి పూలచంద్ర కుమార్, క్లబ్ గౌరవ సభ్యులు గడ సంతుల మధుసూదన్, దూడల వెంకటేష్, కృష్ణ, కళ్యాణ్, దళపతి, యాట, శివ,యాట సందీప్ , అనిల్, మాధవ్, అల్తాఫ్, వంశి, సభ్యులు అభినందించారు,