బాంబుల మధ్య ఒంటరిగా 1000 కి.మీ బాలుడి ప్రయాణం

బాంబుల మధ్య ఒంటరిగా వెయ్యి కి.మీ బాలుడి ప్రయాణం
ఈ క్రమంలో తల్లి అనారోగ్యంతో ,కొడుకు కు గుండె నిండా ధైర్యం నింపి ,పొరుగు దేశానికి, సాగ నమ్మిన వైనం.
మాధ్యమాల్లో వైరల్ కావడంతో, ఈ సంఘటన చూసి తరుక్కు పోతున్న, ప్రపంచ ప్రజల హృదయం అతలాకుతలం..
11సంవత్సరాల బాలుడు, వెయ్యి కిలోమీటర్లు, బాంబుల మోత లో ఒంటరిగా నడిచిన సంఘటన.
రెండు దేశాల మధ్య యుద్ధం అంటే, బాధితుల ఆర్తనాదాలు , ఒంటరి జీవితాలు, ఇదేనా అంటున్న ప్రపంచ లోకం.
హైదరాబాద్, మార్చి 13 ,నిజం న్యూస్
యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం… ఒక్క ఆధిపత్య పోరే కాదు… యుద్ధములో అభాగ్య లైన కుటుంబాలు, పిల్లల దీన పరిస్థితి చూసి ప్రపంచ దేశాల్లోని ప్రజల హృదయాలు , కలిచి వేస్తూ, మానవజాతి పుట్టుకను, ఛీ అని నిందలు వేసుకుంటున్న , సంఘటన లో భాగంగా యుక్రెయిన్ దేశంలోని ఓ నగరం లోని కుటుంబం రష్యా దాడిలో చిన్నాభిన్నమై, ఓ 11 సంవత్సరాల, బాలుడికి పడ్డ కష్టం వర్ణనాతీతం. తల్లి నేర్పిన మొక్కవోని ధైర్యంతో, ఆ బాలుడు వెయ్యి కిలోమీటర్లు నడిచి, పొడుగు దేశానికి చేరుకున్న సంఘటన, ప్రపంచ దేశాల్లోని, ప్రజల హృదయాల్లో యుద్ధం నేర్పిన గుణపాఠంగా చెప్పుకోవచ్చు.
బాలుని ధైర్య సాహసాలను, మనసున్న ప్రతి ఒక్కరు మెచ్చుకోక తప్పదు… కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తి, ధైర్యంతో ఓర్పుతో ,ముందుకు నడిచిన అప్పుడే తమ గమ్యస్థానాలు, చేరుతామని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సుమ…