ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ (నిజం న్యూస్) : గోకుల్‌పురి ప్రాంతంలోని మురికివాడల్లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు.
శుక్ర, శనివారాల మధ్య రాత్రికి మంటలు అదుపులోకి వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ శనివారం తెలిపింది. ఘటనా స్థలం నుంచి అధికారులు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు.సమాచారం అందుకున్న వెంటనే 13 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.
Also read:ఎంబిబిఎస్ లో 5398 ర్యాంక్..కానీ డబ్బులు లేవు
దాదాపు 60 గుడిసెలలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.