ఎంబిబిఎస్ లో 5398 ర్యాంక్..కానీ డబ్బులు లేవు
గిరిజన కుటుంబంలో ఎంబీబీఎస్ ర్యాంకు పొందిన ప్రేమ్ కుమార్!
తల్లిదండ్రులు వ్యవసాయంలో రాణించి, కష్టపడి కుమారుడిని చదివించిన వైనం.
తెలంగాణ రాష్ట్రంలో ఎం బి బి ఎస్5398 ర్యాంకు.
ఎంబీబీఎస్ సీటు కోసం, ఆర్థిక పరమైన అవసరాల కోసం , దాతలు , స్థానిక ఎమ్మెల్యే ముందుకు రావాలని, కుటుంబ సభ్యుల వేడుకోలు.
తుంగతుర్తి, మార్చి 12, నిజం న్యూస్.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏన కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోతు బిచ్చ ఆచలీ లా ముద్దుల కుమారుడు ప్రేమ్ కుమార్ చిన్నతనం నుండి తల్లిదండ్రులు, తమకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ, కష్టపడి, సూర్యాపేటలోని ప్రవేట్ పాఠశాల, చైతన్య కళాశాలలో చదివించారు. దీనితో ప్రవీణ్ ఉత్తమ ప్రతిభ కనపరుస్తూ ,మంచి మార్కులు సాధించే వాడు.
అనంతరం పీజీ కరీంనగర్ లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చదివి, పీజీలో కార్డియాలజీ లో రాణించడం జరిగిందని పేర్కొన్నారు.
దీనితో ఈ మధ్యలో జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలు ఎం బి బి ఎస్ తరపున పోటీ పరీక్షల్లో పాల్గొని 468 మార్కులకు గాను 5398 ర్యాంకును తెలంగాణలో సాధించాడు. దేశం మొత్తం మీద చూసినట్లయితే1,14,227 వ ర్యాంకును సాధించినట్లు ఆనందంతో తెలిపారు.
. ఏది ఏమైనా ప్రస్తుతం ఎంబిబిఎస్ చేయాలంటే, ఆర్థిక పరిస్థితులు ఆశించిన రీతిలో లేనందున ఈ గిరిజన ఆణిముత్యాన్ని, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి, సమాజానికి సేవ చేయాలని దృడ సంకల్పంతో ఉన్న, డాక్టర్ గా చూడాలని కలగంటున్న ప్రేమ్ కుమార్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, పేద గిరిజన కుటుంబ సభ్యులు, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు పూర్ణ నాయక్ నిజం న్యూస్ తో మొదటిసారిగా కుటుంబ సభ్యులు మాట్లాడారు…