చెరువులో పడి వివాహిత ఆత్మహత్య
కామారెడ్డి మార్చ్ 11 నిజం న్యూస్
చేసుకుంది
ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత 50 సంవత్సరాల వయస్సు గల లావణ్య గా గుర్తించారు. అనారోగ్య సమస్యతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో నివాసం ఉండే అశోక్, లావణ్య దంపతులు. లావణ్య ఇంట్లో ఉంటూ అశోక్ వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు.
ALSO READ: భారతదేశం కోసం యుద్ధం 2024లో..
గత కొన్ని రోజులుగా లావణ్య అనారోగ్యంతో బాధపడుతుంది. లావణ్య కు భర్త అశోక్ వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో లావణ్య గురువారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీంతో భర్త అశోక్ లావణ్య కోసం చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం లావణ్య మృతదేహం సరంపల్లి చెరువులో లభ్యం అయింది. మృతురాలి భర్త అశోక్ తెలిపారు, ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.