బీ సి ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

*బీ సి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ *

నల్లగొండ టౌన్ 11 ( నిజం న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీ సీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బీ సి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ లో అరవై ఐదు శాతానికి పైగా ఉన్న బీ సి లకు కేవలం మూడు శాతం నిధులు కేటాయిస్తే ఏ విధంగా బీ సి లకు న్యాయం జరుగుతుందని అన్నారు.

రాష్ట్ర సంపద సృష్టించేది, ఉత్పత్తి చేసేది బీ సి లని,రాష్ట్రంలో ఎక్కువగా పన్నులు కట్టేది కూడా బీ సి లని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇరవై వేల కోట్లు కేటాయించి బీ సి ల పై చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో పాల్వాయి రవి కుమార్, ఏలిజాల వెంకటేశ్వర్లు, బోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు