Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గుడుంబ కట్టెల లోడు పట్టుకున్న నెక్కొండ ఎస్సై

వరంగల్ మార్చి10(నిజం న్యూస్):
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని తేదీ 10-3-2022 గురువారం రోజున మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ హాతిరామ్ ఆదేశాల మేరకు మండలంలోని చిన్నకొర్పొల్ గ్రామ శివారులో గుడుంబా తయారీ ఉపయోగించే కట్టెలను ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న క్రమంలో నెక్కొండ ఎస్సై సీమఫర్హీన్, చెన్నారవుపేట ఎస్సై తోట మహేందర్ కలిసి పట్టుకోవడం జరిగింది. అట్టి వాహనాన్ని అటవీశాఖ బీట్ ఆఫీసర్ పుల్యకు అప్పగించడం జరిగింది.