వామ్మో…కరెంట్ బిల్లు షాక్

మధిర మార్చి 10(నిజం న్యూస్)
కార్పోరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ పికే రామయ్య కాలని కి చెందిన విజయ్ మండల్ నిరుపేద కుటుంబానికి 30738/-రూపాయలు కరెంట్ బిల్లు వచ్చింది.ఈ బిల్లును చూసిన ఆ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.రోజు కూరగాయలు అమ్ముకొని వచ్చిన ఆ చిల్లర డబ్బులతో పొట్టబోసుకునే మాకు ఇంత కరెంట్ బిల్లు వచ్చింది ఏంటని అడిగితే మాకు తెలియదు ఆఫీస్ లో కలువండనే నిర్లక్షపు సమాధానం…
ఏమిచేయాలో పాలుపోక బోరున విలపిస్తున్నారు.ఇంత డబ్బు మేం జీవితం మొత్తం కష్టపడ్డ కట్టలేమని మాకు చావు తప్ప వేరే మార్గం లేదని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు అట్టి మీటర్ల పై విచారణ జరిపించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం