చదువుల తల్లి, అమ్మా సావిత్రీ భాయి

అక్షరాస్యతకు,సంస్కారానికి,సైన్సుకి శ్రీకారం చుట్టిన మహా పుణ్యాత్మురాలు పోలగాని వెంకటేష్ గౌడ్.
మిర్యాలగూడ (జిల్లా ప్రతినిధి):మార్చి 10(నిజంన్యూస్) నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో శకుంతల థియేటర్ వద్ద అనగారిన బతుకుల్లో చదువులు నింపిన సావిత్రిబాయి పూలే 125 వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ లో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
- మా తల్లి సావిత్రీ భాయి!
- భరతావని ప్రగతికి స్త్రీ విద్య అవసరమని,యుద్ధము చేసిన ,ధీర వీర వనితవు అమ్మా ,మా తల్లీ సావిత్రీ భాయి! కొనియాడారు
మా తల్లీ సతీ తనయలఅక్షరాస్యతకు, అభివృద్ధికిసంస్కారానికి సైన్సుకి,శ్రీరస్తని శ్రీకారం చుట్టినగట్టి పునాది వేసిన మహాపుణ్యాత్మురాలి అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ అన్నారు. అందుకు అనుకూలంగా ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన కొరకు పాటుపడాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ సభ్యులు చిరుమరి కృష్ణయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి,సామాజికవేత్త డాక్టర్ రాజు, కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి,పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శీను ,కాంగ్రెస్ కౌన్సిలర్లు దేశీరెడ్డిశేఖర్రెడ్డి,గంధం రామకృష్ణ ,సీనియర్ నాయకులు పగిడి రామలింగయ్యా యాదవ్,మై బిల్లి , కాకునూరి బసవయ్య గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బెజ్జం సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, చాంద్ పాషా ,బీసీ సంఘం జిల్లా నాయకులు నల్లగంతుల నాగభూషణం, జయరాజు,పోగుల సైదులుగౌడ్విద్యార్థి సంఘం నాయకులు శంకుయాదవ్ టిఆర్ఎస్వి రాష్ట్రనాయకులషోయబ్,కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మంద పద్మ, వైస్ ప్రెసిడెంట్ ఆకుల పరమేశ్వరి, యాదమ్మ ,గొర్ల కాపరి సంఘం, శ్రీనివాస్ యాదవ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు,తలకొప్పుల సైదులు, జిల్లా నాయకులు కంచుగంట్లలింగయ్య యాదవ్, మైనార్టీ మండలాధ్యక్షులు గౌస్ తదితరులు . వర్ధంతి వేడుకల్లో ఎస్సీ ఎస్టీ ,బీసీ ,మైనార్టీ అన్ని వర్గాల రాజకీయ నాయకులు పాల్గొని విజయవంతం చేసారు.