Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జిల్లా కలెక్టర్ కి నోటీసులు..

అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో మహిళలపై అధికారులు చేసిన దాడిపై కేసు నమోదు.

 

ములకలపల్లి మార్చి .10 (నిజం న్యూస్)భద్రాద్రికొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం. ఉలవనూరు మల్లారం పంచాయితీ, గ్రామ ఆదివాసీల పై స్థానిక అధికారులు మహిళలు అని చూడ కుండా దాడి చేసిన వారి పై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ వారికి గ్రామస్తులు ఆదివాసి మహిళలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదివాసీ మహిళ ల పై దాడి చేసిన ఘటనపై మహిళా దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో కేస్ నమోదు అయింది.

త్వరలో విచారణ జరగనుంది భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జానకిరామ్ సహకారంతో, పాల్వంచ మండలం మల్లారం ఆదివాసీల పొడు భూమి రైతులకు జరిగిన అన్యాయంపై పొడు భూమి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కమిటీ అటవీ హక్కుల కమిటీ తీర్మానం లేకుండా, పిసా గ్రామ సభ తీర్మానం లేకుండా, స్థానిక సర్పంచ్ కమిటీ అనగా ఎఫ్ ఆర్ సి కమిటీ తీర్మానం జరగలేదు, ఐన పొడు భూములు దౌర్జన్యంగాస్వాధీనం చేసుకుంటున్న ఫారెస్ట్ అధికారులు, మరియు వారికి సపోర్ట్ చేస్తున్న పోలీస్ అధికారులు. ఏజెన్సీ 1/59 1/70 1989పెసా చట్టాలను ఉల్లంగిస్తూ అమాయక ఆదివాసీ పై పోలీసులు జూలూమ్ చూపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారులు, మరియు పోలీసు అధికారులు , మల్లారం గ్రామ ఆదివాసుల పై అధికారులు జరిపిన దాడి పై విచారణ చే పట్టిన తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్..

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ కినోటీసులు ఇవ్వడం జరిగింది. మల్లారం ఆదివాసీ ప్రజలు గత 25 సంవత్సరాలు గా పొడు భూమి సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్న నిరు పేద ఆదివాసీల భూములను లాక్కోవడం అమానుషం..?జిల్లా పై అధికారుల పర్మిషన్ లేకుండా వారి స్వలాభం కొరకు అతి ఉత్సాహం తో ఒకపక్క టిఆర్ఎస్ రోలింగ్ ప్రభుత్వంఆదివాసీ భూములకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి దరఖాస్తు తీసుకుంటూ ఉంటే అమాయక ఆదివాసీల పొడు భూములను లాక్కోవడం అటవీశాఖ అధికారులకు తగదని.పై అధికారులు విచారణ చేపట్టి బాధితులకు మహిళలు గ్రామస్తులకున్యాయం చేయాలని కోరుతూ. ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ వూకే, రవి పాల్వంచ మండలం అధ్యక్షులు కాకా సురేష్, పాయం నగార్జున్,శెట్టి పల్లి శ్రీను చరప్ప సురేష్, తదితరులు పాల్గొన్నారు.