గోదావరిఖని అడ్రియాల భూగర్భ గని ప్రమాద మృతులకు సంతాప సభలు

మణుగూరు మార్చి10(నిజం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు సింగరేణి ఉద్యోగుల సేవలు సరిహద్దుల్లో సైన్యం సేవలతో సమానం ప్రమాదం దురదృష్టకరం పీకే ఓసి ప్రాజెక్ట్ ఇంజనీర్ జె వీరభద్రుడు
గడ్డకట్టే చలిలో సైతం సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దు సైనికుల సేవలతో సింగరేణి ఉద్యోగుల సేవలు సమానమని దేశ భద్రత కై వాలు ప్రాణాలర్పిస్తే ప్రకృతికి విరుద్ధంగా జగతికి వెలుగులునిచ్చేందుకు బొగ్గు గని ఉద్యోగులు కూడా ఊహించని కొన్ని ప్రమాదాలలో తృణప్రాయంగా వారి ప్రాణాలర్పిస్తూన్నారని వారి సేవలు అజరామమని పీకే ఓసి ప్రాజెక్ట్ ఇంజనీర్ జె వీరభద్రుడు అన్నారు, గోదావరిఖని అడ్రియాల ప్రాజెక్ట్ భూగర్భ గని పైకప్పు కూలి ఇద్దరు అధికారులు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృత్యువాత పడిన నేపథ్యంలో మృతులు ఎస్ జయరాజు ఏరియా సేఫ్టీ ఆఫీసర్, తేజావత్ చైతన్య తేజ అసిస్టెంట్ మేనేజర్, తోట శ్రీకాంత్ కాంట్రాక్ట్ కార్మికుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని గురువారం ఉదయం ఓసి 2 పవర్ సెక్షన్ లో కార్మికులు నిర్వహించిన సంతాప సభ లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ ప్రమాదం దురదృష్ట సంఘటనగా ఆయన అభివర్ణించారు ప్రమాదాన్ని గమనించి అక్కడ పనిచేస్తున్న ఇతర ఉద్యోగులను హెచ్చరించి వారిని అక్కడి నుండి తప్పించి అదే ప్రమాదంలో అసువులు బాసిన ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజు ధైర్యం ప్రశంసనీయమన్నారు ఇదే ప్రమాదంలో ఆయన కూడా మృత్యువాత పడటం బాధాకరమన్నారు, చైతన్య తేజ చిన్న వయసు లోనే అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి ఎదిగానని ఆయనకు ఇంకా మంచి భవిష్యత్తు ఉందని ఈ లోగా ఇలా జరగడం ఊహించని పరిణామ మాన్నారు, కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ ది కూడా చిన్న వయసే అన్నారు, పైకప్పు కూలిన ప్రమాదంలో రాత్రింబవళ్ళు శ్రమించి ముగ్గురు ప్రాణాలు కాపాడిన సింగరేణి రెస్క్యూ టీం సేవలను యావత్ ప్రపంచం జేజేలు పలికిందన్నారు.
అనంతరం ప్రమాద మృతుల కు సంతాప సూచకంగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు బొగ్గుగని అడ్రియాల అమరవీరులకు జోహార్లు అంటూ కార్మికులు నిలదించారు, ఇంకా పీకే ఓసి లో ..రక్షణ విభాగం, బ్లాస్టింగ్ సెక్షన్, షావెల్స్ & డ్రిల్స్ విభాగం, డోజర్ సెక్షన్, సర్వే డిపార్ట్మెంట్, పైలట్ కాలనీ దుర్గా క్యాంపులో మృతుల సంతాపసభలు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నిర్వహించారు.
యస్ డి నా సర్ పాషా సమన్వయకర్తగా వ్యవహరించగా ఇంకా ఈ కార్యక్రమాలలో అధికారులు పిసాయినాథ్, ఎస్ మధుసూదన్,దావులూరి శ్రీనివాస్,పి కుమార్, వరుణ్, రామదాస్,సుధీర్, విజయ రావు, డేవిడ్, శంకర్, కొండయ్య,సూపర్వైజర్లు మాదాసు శ్రీనివాస్, వేమాసత్యనారాయణ , మహేష్, భాస్కర్, శంకర్, కిరణ్, శ్రవణ్,నాయకులు సిహెచ్ అశోక్,ఎ రవీందర్,భద్రయ్య, వెంకటరత్నం, వి రవీందర్ రావు, సి హెఛ్ రవి బాబు , కిషన్, కార్మికులు యస్ కె ఖాదర్, సుధాకర్, కొండలు, బిక్షపతి, హుస్సేన్, ఇమామ్, ,రామ్మూర్తి,శివ కోటా చారి, చింతల కొమరయ్య, రమేష్ ,శ్రీధర్ నరేష్, రామ చందర్, రాకేష్ ,వరుణ్ , తిరుపతి, అనిల్, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.