కొండాపురం పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

కే.టి.దొడ్డి : 10మార్చి(నిజం న్యూస్) మండలం కొండాపురం జడ్పీహెచ్ఎస్ బడిలో కల్లోలం రేగింది. ఆరోగ్యంగా వచ్చిన విద్యార్థులు మద్యాహ్నం బోజనం చేసిన తర్వాత ఒక సారిగా వాంతులు చేసుకోవడంతో అస్వస్థతకు లోనయ్యారు. వివరాలు వెళ్లితే…. కొండాపురం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రొజులగా విద్యార్థులు అస్వస్థత కు గురికావడం తల్లి దండ్రులలో ఆందొళన కలిగించింది.
మండల అధికారుల ర్యవేక్షణ లేకపోవడమే కారణం మద్యాహ్నం సమయంలో నాణ్యత లేని బోజనం విద్యార్థులకు వడ్డిస్తున్నారని బుధవారం విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. ఏజెన్సీ వారిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో తాము పెట్టిందే తినాలనేలా విద్యార్థులకు భోజనాన్ని అందజేస్తున్నారని ఆరోపణలు. మండల విద్యాశాఖ అధికారులు నిరంతరం పాఠశాలను పర్యవేక్షించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.