కామ ఉపాధ్యాయుడు సుదర్శన్ రెడ్డి కి దేహశుద్ధి

 

పాఠశాల బాలిక పై అసభ్యకరంగా ప్రవర్తించిన వైనం.

నూతనకల్, మార్చి 10 ,నిజం న్యూస్

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమల్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న సుదర్శన్ రెడ్డి (45)సం.లు.. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి అదే పాఠశాలలో చదువుకున్న మైనర్ బాలికతో పాఠశాలలోనీ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏమి తెలియని బాలికలు భయంతో బయటకు పరుగులు తీయడంతో పాఠశాల ఆవరణలో ఉన్న గ్రామస్తులు విద్యార్థులను అడుగగా తనతో అసభ్యంగా ప్రవర్తించడం తెలిపారు.. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో ఆ కామ ఉపాధ్యాయుని తమదైన శైలిలో దేహశుద్ధి చేశారు. జరిగిన సంఘటనపై పోలీసులు అధికారులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.