జాతీయ కబడ్డీ క్రీడలకు ఎంపికైన సంధ్య

యాదాద్రి భువనగిరి ప్రతినిధి మార్చి 9 (నిజం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లోని కామిని గూడెంకి చెందిన బసవాడ సంధ్య ఈ నెల 7న సరూర్నగర్ స్టేడియంలో జరగబోయే ఆటలకు ఎన్నికై తెలంగాణ కబడ్డీ రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్నదని జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య తెలిపారు.ఈ 68వ జాతీయ క్రీడలు మార్చి నెల 10 నుండి 13 వరకు హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లా సెక్దాద్రి పట్టణంలో జరుగు జాతీయ క్రీడ లో పాల్గొనడం జరుగుతుంది.గతంలో జూనియర్స్ విభాగంలో గుజరాత్, హర్యానా సబ్ జూనియర్ విభాగంలో జార్కండ్, తమిళనాడు జాతీయ క్రీడలలో పాల్గొన్నడం జరిదింగిదని.ఇట్టి జాతీయ క్రీడ లో పాల్గొంటున్న సంధ్యను యాదాద్రి భువనగిరి కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డి, చైర్మన్ పైలా శేఖర్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ సునీత మహేందర్, ప్యాట్రన్ కొలుపుల కమలాకర్, ఎల్లందు మల్లేష్, ఉపాధ్యక్షులు అశోక్,మోరి గాడివెంకటేష్ గారు కోశాధికారి గంధమాల కుమార్, సహాయ కార్యదర్శి భాస్కర్,చేతన్ నాగేశ్వరరావు.వ్యాయామ ఉపాధ్యాయులు గడసంతుల మధుసూదన్, చిన్నధం విజయ్ సురేందర్, నరేష్ పూల చంద్ర కుమార్ , భాను, సందీప్, లావణ్య, శ్రీలత గార్లు అభినందించారు.