సబ్ స్టేషన్ లో పేలిన సి వి టి … కోటి రూపాయల నష్టం.

తుంగతుర్తి ,మార్చి 9 నిజం న్యూస్
మండల కేంద్రంలోని 133 కెవి సబ్ స్టేషన్ లో, సి వి టి పేలడంతో భారీగా పొగలు వచ్చి, సామాగ్రి పి టి ఆర్ 2 కు తగలడంతో, ప్రస్తుతం అందులో ఉన్న ఆయిల్ మొత్తం లీక్ అవుతున్నది. అధిక ఓల్టేజి పడడం తోనే ఈ సంఘటన జరిగినట్లు స్థానిక ఆపరేటర్ సతీష్ పేర్కొన్నారు. జరిగిన సంఘటనను జిల్లా ఉన్నత కరెంట్ అధికారులకు తెలియపరచండి తెలిపారు. ఏదిఏమైనా సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో గ్రామాలకు కరెంటు అంతరాయం కలిగి ఉన్నట్లు తెలిపారు.