ప్రమాదంలో మహిళ మృతి…భర్త కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి….
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి క్రైమ్ మార్చి 8(నిజం న్యూస్)
జనగాం మండలంలోని జాతీయ రహదారి 163 పై మంగళవారం ఉదయం పెంబర్తి హరిత హోటల్ వద్ద జనగామ నుండి ఆలేరు వెళ్తున్న ఆటో ను వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదం లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన కోరుకొప్పుల భాగ్యలక్ష్మి (45) మృతి చెందగా అతడి భర్త కు గాయాలు అయ్యాయి.మహిళా దినోత్సవం రోజున రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందడం పట్ల పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అతి వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.