వైద్యుల నిర్లక్ష్యంతో పాప మృతి…ఆస్పత్రి ఎదుట ఆందోళన

 

యాదాద్రి భువనగిరి జిల్లా క్రైమ్ మార్చి 7 (నిజం న్యూస్)

వైద్యుల నిర్లక్ష్యంతో పాప మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది…. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణికుట్ల గ్రామానికి చెందిన బాల నర్సయ్య కమల దంపతుల ఐదు నెలల పాప అనారోగ్యంతో బాధపడుతుండటంతో జనగామ జిల్లా కేంద్రంలోని లోటస్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు… చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందదాని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు…. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతూ ఐదు నెలల పాపకు అనారోగ్యం, పిట్స్ తో బాధ బాధపడుతుండతో ఈనెల ఆరవ తేదీన లోటస్ హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగిందన్నారు…. డాక్టర్ లింగమూర్తి పాపాకు ఆక్సిజన్ తక్కువగా ఉందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని చెప్పడంతో ఆస్పత్రిలో చేరడం జరిగిందాని తెలిపారు . పాపకు ఆక్సిజన్ అందిస్తున్న తరుణంలో ఫీట్స్ వస్తుందని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాప సోమవారం మృతి చెందింది .