పాతూరి ని వరించిన మరో కీర్తి కిరీటం
పుడమి సాహితీ వేదిక, జాతీయ పురస్కరాలు.
విద్యారత్న జాతీయ పురస్కారం, 2022
రాజన్న సిరిసిల్లా జిల్లా, మార్చి 07 (నిజం న్యూస్):
దేశ వ్యాప్తంగా విద్యారంగంలో చేస్తున్న విశేష కృషిని గుర్తించి పుడమి సాహితీ జాతీయ వేదిక అందించిన విశిష్ట పురస్కారం మహేందర్ రెడ్డిని వరించింది.
పుడమి సాహితీ జాతీయ వేదిక మూడవ వార్షికోత్సవ సందర్బంగా నేడు హైదరాబాద్ లో మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణప్రభుత్వ సలహాదారులు సముద్రాల వేణుగోపాల చారి, ఏనుగు నర్సింహా రెడ్డి, అదనపు కలెక్టర్ మేడ్చల్ జిల్లా గారల చేతుల మీదుగా అందుకున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పాతూరి మహేందర్ రెడ్డి 26 సంవత్సరాలనుండి విద్యారంగంలో సేవ చేస్తూ ఇప్పటికే 18 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు.
ఇప్పటివరకు పాతూరి అందుకున్న
జిల్లా రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డ్స్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, స్వచ్ఛ విద్యాలయ రాష్ట్ర స్థాయి పురస్కారం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ట్యూటర్స్ ప్రైడ్ ఐడియాల్ టీచర్ అవార్డు, అబ్దుల్ కలాం అవార్డు, నేషనల్ ఇంటిగ్రేటెడ్ అవార్డు, రాష్ట్ర గురు బ్రహ్మ అవార్డు, విద్యా భూషణ్ జాతీయ అవార్డు, సేవారత్న రాష్ట్ర స్థాయి అవార్డు, వండర్సా బుక్ అఫ్ రికార్డ్స్ గోల్డ్ మెడల్, సావిత్రిబాయ్ విశిష్ట సేవా పురస్కారం, కరోనా వ్వారియర్ రాష్ట్ర స్థాయి పురస్కారం, గ్లోబల్ టీచర్ అవార్డు, విశ్వగురు ఇంటర్నేషనల్ అవార్డు, ప్రైడ్ అఫ్ ఇండియా నంది అవార్డు ఎక్స్ క్లూసీవ్ వరల్డ్ రికార్డు అవార్డు
ఇలా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్న మహేందర్‌రెడ్డి ఇప్పటివరకు 1453 ప్రశంసా పత్రాలు సాదించి అంతర్జాతీయ స్తాయి రికార్డు సృష్టించాడు. మహేందర్ రెడ్డిని మంత్రి కేటీర్, జిల్లా కలెక్టర్, వివిధ ఉపాధ్యాయ సంఘాలు విద్యాధికారుల అభినందనలు పొందారు.