Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భయం గుప్పెట్లో …వెలుగుపల్లి..?

వెలుగు పల్లి లో రాత్రి ఘర్షణ సమయంలో

అడ్డు పోయిన పోలీస్ సిబ్బందిపై , దుండగులు దాడి గాయాలు.

బిక్కు, బిక్కు మని నిద్రపోయిన గ్రామస్తులు. వచ్చిన వారు ఎవరు? ఎందుకు కొట్టారు? మారణాయుధాలతో బెదిరించినట్లు సమాచారం.

టిఆర్ఎస్ నాయకుని గుడిపాటి సుమన్, చితకొట్టిన దుండగులు.

గొడవ సమయములో ఉన్న క్రైమ్ న్యూస్ రిపోర్టర్ పై దాడి ,హేయమైన చర్య.

తుంగతుర్తి, మార్చి 7, నిజం న్యూస్.

తుంగతుర్తి మండలంలో ప్రశాంత వాతావరణం, పచ్చని పైరులతో, జీవితాలు గడుపుతున్న వెలుగు పల్లి గ్రామస్తుల లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా సూర్యాపేటకు చెందిన కొంతమంది దుండగులు, మారణాయుధాలతో, రెండు కార్లలో వచ్చి, యాదవ కులానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దాడి నుండి తేరుకొని, ఓ దళిత వ్యక్తి మోటార్ బైక్ పై, దళితవాడకు, యాదవుడు చేరుకునే లోగా, బైకును వెంబడించిన దుండగులు, యాదవ్ ని తీసుకు వెళ్తున్నాడు అనే కోపంతో, ఆగ్రహానికి గురై, దళితవాడల్లో తిరుగుతూ, అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని, దాడులు చేశారు. యాదవ కుటుంబానికి చెందిన రెండు ఇళ్లలోని వారు తాళాలు వేసుకుని, పలాయనం చిత్తగించారు. జరిగిన సంఘటనపై స్థానికులు తక్షణమే పోలీసులకు ఫోన్ చేయగా, హుటాహుటిన తుంగతుర్తి ఎస్ఐ ఆంజనేయులు సిబ్బందితో వెళ్లగా, అక్కడ మాత్రం సినిమా తరహాలో, కొడుతున్నారు, ఆపడానికి వెళ్లిన ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా, గాయాలపాలైన ట్లు సమాచారం. దళిత వీధుల్లో దాడి జరుగుతుండగా, అడ్డు వెళ్లిన టిఆర్ఎస్ నాయకులు పై కూడా చితకబాదడం, బాధాకరమైన విషయం. అసలు ఎందుకు ఈ దాడి జరిగింది, ?ఎవరి కోసం వారు వచ్చారు,? అసలు ఏమి జరుగుతోంది.? మొదట యాదవ్ పై దాడికి కారణమేంటి? వెలుగు పల్లి లో ప్రశ్నార్థకంగా మారింది. ప్రశాంతంగా జీవితాలు గడుపుతున్న మా గ్రామంలో ఇలా జరగడం దారుణమని, ఏది ఏమైనా జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, దుండగులను శిక్షించాలని, వెలుగు పెళ్లి దళితులు, గ్రామస్తులు కోరుతున్నారు.