మహిళా బంధు .. కేసీఆర్

టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి!

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో.. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

హైదరాబాద్, మార్చి 6, నిజం న్యూస్

హైదరాబాద్ లోని కొత్తపేట,వాసవీ కాలనీ అష్టలక్ష్మీ దేవాలయం వద్ద కిన్నెర గ్రాండ్ హోటల్ లో *ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో. ఆదివారం రోజున జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత మహిళలకు కుట్టుమిషన్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన మహిళా మణులందరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు,అమ్మాయిలలో ఉన్న భయాన్ని పోగొట్టి, వారిలో ధైర్యం నింపేందుకు స్త్రీల రక్షణ కోసం షీ-టీమ్స్ ఏర్పాటు చేశారని అన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి,వారి ప్రతిభను గుర్తించి, వాళ్ళను ప్రోత్సహించడం మంచిది అన్నారు. మహిళలు తమను తాము రక్షించబడేలా తయారు కావాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి, విజయం సాధించి, మన తల్లిదండ్రులకు, దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించటమే కాకుండా జీహెచ్‌ఎంసీలో అదనంగా మరో పది సీట్లు కేటాయించారని తెలిపారు. మార్కెట్‌ కమిటీల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు.

అనంతరం.తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ…* తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈరోజు నుంచి మూడు రోజుల పాటు (మార్చి 6,7,8) చేపట్టిన వివిధ కార్యక్రమాల నేపథ్యంలో..
పెద్దఎత్తున మహిళా దినోత్సవ సంబరాలు జరపాలని గౌరవ మంత్రివర్యులు, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీ కేటీఆర్ ఆదేశానుసారం… మూడురోజుల పాటు జరిగే కార్యక్రమాలలో భాగంగా.. అంబరాన్ని తాకేలా మూడు రోజులపాటు మహిళా దినోత్సవ సంబరాలు జరగనున్నాయి.తెలంగాణ అడబిడ్డలను తోబుట్టువుల చూసుకుంటు, వారి సంక్షేమం, అభివృధి కోసం ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను చేపట్టి,వారి సంక్షేమం కోసం కృషి చేస్తోంది సీఎం శ్రీ కేసీఆర్ అన్నారు. ఆడబిడ్డల అభివృద్ధి సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా టిఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోంది అని అన్నారు. సామాజిక సేవలో..ఆర్యవైశ్యులు ముందు ఉండాలి. ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని,ఇకముందు కూడా ఉండాలని అన్నారు. ఐ వి ఎఫ్ ఆధ్వర్యంలోఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రిలిమినరీ పాస్ అయి, ఐఏఎస్, చదువుతున్న 20 మంది కి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు.
*సీఎం కేసీఆర్ నాయకత్వంలో.* మహిళకు మంచి రక్షణ, అవకాశాలు లబిస్తున్నాయి అని మహిళా సంక్షేమానికి అభివృద్ధి కి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి మగవారి విజయం వెనుక ఆడవారు ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని 33 జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలలో, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు. *తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.* మన రాష్ట్రంలో బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ..ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఊర్లో బడి, గుడి, అన్నదానం, ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అయినా చేయడానికి ఆర్యవైశ్య సోదరులు, మహిళలు ముందుటరు. మొన్న కరోన సమయంలో కూడా ఆర్యవైశ్యులు బయటకు వచ్చి పేదలకు సాయం అందించడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమం ఏదైనా కావచ్చు ఆర్యవైశ్యులు ముందు ఉంటారని అన్నారు. ఐ వి ఎఫ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు.

*ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, కల్నన్ సంతోష్ బాబు సతీమణి డిప్యూటీ కలెక్టర్ సంతోషిని, గ్రంధాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టిఆర్ఎస్ పార్టీ కంటెస్టడ్ అభ్యర్థి విజయ భారతి అరవింద్ శర్మ, ఐ వి ఎఫ్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి , ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్- ఐ వి ఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ గంగిశెట్టి రఘు, రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, సెక్రటరీ లెంకల పల్లి మంజుల రాజు, ట్రెసరర్ గంగిశెట్టి సుజాత, చీఫ్ అడ్వైసర్ కలకొండ మణి మాల,అడ్వైసర్స్ అర్చన,శిరీష మరియు జిన్నం వేణు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మిడిదొడ్డి శైలజ, తటవర్తి విజయ లక్ష్మి , భువనేశ్వరి,పొలా అర్చన, రాచమల్ల రజిత, వినోభా వావిలాల, శైలజ గ్రంధిశిల, గంజి శైలజ, గంగిశెట్టి పావని, సరళ గుప్త, వాస శ్రీదేవి, పొద్దుటూరి శాంతి, సోమ స్వప్న , వనజ కొత్త,ఆకుతోట బాగ్య, బచ్చు నవనీత, నిర్మల, యాంకర్ ప్రత్యూష సీరియల్ ఆర్టిస్ట్, గ్రంధిశీల శైలజ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ , మహిళా విభాగం సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు , ఐ వి ఎఫ్, మహిళా నాయకులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.