నిరుపేదలకు ఆపన్నహస్తం “హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్”
*నిరుపేదలకు ఆపన్నహస్తం “హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్
*దాతృత్వానికి మారుపేరు “హ్యాపీ లైఫ్స్
*అన్నార్తుల సేవలో ఆదర్శంగా నిలుస్తున్న ఫౌండేషన్*
*జీతాల్లో నుండి సేవకు వెచ్చిస్తున్న పోలీసులు,టీచర్స్ బృందం*
కొంతమంది పోలీసు సిబ్బంది, టీచర్స్ మరియు ప్రైవేట్ ఉద్యోగులు కలిసి కడుపేదరికంతో బాధపడే వారికోసం,చదువుకోవడానికి ఇబ్బందిపడే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ 2021 డిసెంబర్ నెలలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు 60 కి పైగా నిరుపేద కుటుంబాలక ఎంచుకుని నిత్యావసర సరుకులను సుమారు 2 లక్షల రూపాయల వరకు నిత్యావసర సరుకులను హ్యాపీ లైఫ్స్ (స్వచ్ఛంద సేవా సంస్థ) తరపున అందజేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సంస్థ బయటనుండి ఇప్పటివరకు ఎటువంటి విరాళాలు పొందలేదు. సంస్థ సభ్యులే వారి నెల జీతాల నుండి కొంతమొత్తం అన్నార్తులను, చదువుకోవడానికి ఇబ్బందిపడే నిరుపేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని హాపీ లైఫ్స్ ఫౌండేషన్ తరఫున వారికి సహాయం చేయడం కోసం వెచ్చిస్తున్నారు. “మనవసేవే మాధవ సేవ” అంటూ ఆకలితో,కడు పేదరికంతో బాధపడే వారి కోసమే హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఏర్పాటుచేశామని సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ ప్రసాద్ ముదిరాజ్ బండారు తెలిపారు.మన నివాస ప్రాంతంలో పేదరికంతో బాధపడడం ఆర్ధిక ఇబ్బందులు వలన మధ్యలోనే చదువు ఆపివేసి కూలి పనులు చేసేవారిని గుర్తించి హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్(స్వచ్ఛంద సేవా సంస్థ) వారికి తమవంతు సహాయసహకారాలు అందించడంలో ముందుంటుంది.
*సేవలు అభినందనీయం :-*
ఇటీవల తల్లిదండ్రులు కోల్పోయిన పోచంరాల్ గ్రామం ఘన్పూర్ మండలం మెదక్ జిల్లా చెందినటువంటి కళావతి సాయిలు దంపతులు అప్పుల బాధ తట్టుకోలేక తండ్రి బలమన్మరణం చేసుకున్నాడు. కొద్దిరోజులకే ఆనారోగ్యంతో తల్లి కూడా మరణించింది. ఇలాంటి దయనీయ పరిస్థితులలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి దివ్య కు హ్యాపీ లైఫ్ ఫౌండేషన్ 7000/- రూపాయల చెక్కును పోస్టులో ద్వారా పంపించడం జరిగింది. అదే విధంగా హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ (స్వచ్ఛంద సేవా సంస్థ)ఆధ్వర్యంలో మంతపురి గ్రామంలోని ఏలూరి మైశయ్య కడు పేదరికంతో బాధపడడం గుర్తించి వారికి నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఆలేరు సబ్ ఇన్సిపెక్టర్ (ఎస్. ఐ) ఇద్రిస్ అలీ,స్టేషన్ సిబ్బంది మరియు సంస్థ సభ్యులు ఎంతో ఉత్సాహంగా తమ సహాయాన్ని అందించారు. అంతేకాదు తాటికాయల జంగయ్య భువనగిరిలోనీ సీతానగర్ లో నివాసం ఉంటూ ప్రైవేట్ టీచర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకునేవాడు. అతనికి భార్య కూతురు కొడుకు ఉన్నారు.అయితే జంగయ్య శారీరక వికలాంగుడు కావడం వలన కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటే తన భార్య సుమలత రోజూ పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకునేది. ఇలా ఉండగా జంగయ్య కు అనారోగ్య కారణాల వలన గుండెలో స్టంట్ వేశారు కానీ కొంతకాలానికే అతను గుండెపోటుతో మరణించాడు.దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషయం హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ (స్వచ్ఛంద సేవా సంస్థ) దృష్టికి రావడం జరిగింది. వెంటనే స్పందించిన హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ వారి కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటుగా కారం,ఉప్పు, పసుపు,నూనె సబ్బులుఇతరత్రా నిత్యావసర వస్తువులు ఇప్పించి కుటుంబాన్ని ఆదుకున్నారు.అలాగే కోట లింగయ్య మంతపురి వారికి కుటుంబానికి నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.
*సమాజ సేవలో పాలుపంచుకోండి:- ప్రసాద్ ముదిరాజ్ బండారి(సంస్థ భువనగిరి ఇంచార్జ్)*
నిరుపేదలు,చదువుకోవడానికి ఇబ్బందిపడే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని హాపీ లైఫ్స్ ఫౌండేషన్ (స్వచ్ఛంద సేవా సంస్థ) ను మొదలు పెట్టడం జరిగింది.
“మనవసేవే మాధవ సేవ” అని నమ్ముతూ ఆకలితో కడు పేదరికంతో బాధపడే వారి కోసమే హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ (స్వచ్ఛంద సేవా సంస్థ) ఇప్పటివరకు ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది.
మీ ప్రాంతాలలో కూడా పేదరికంతో బాధపడుతూ ఆర్ధిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే చదువు ఆపివేసి కూలి పనులు చేసేవారు ఉంటే మా హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్(స్వచ్ఛంద సేవా సంస్థ) దృష్టికి తీసుకువస్తే సమాజానికి మీరు కూడా సేవ చేసినవారవుతారు. కేవలం ఇద్దరితో ప్రారంభించిన హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్లో ఇప్పుడు 167 మంది స్వచ్చందంగా తమ సేవలు అందిస్తున్నారు. హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ (స్వచ్ఛంద సేవా సంస్థ) అనేది ఏ ఒక్క కులం, మతానికి,ప్రాంతానికి చెందినది కాదు ఎక్కడ ఆపద ఉంది అని తెలిసిన సహాయం చేయడానికి ముందుకు వచ్చేదే హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్
దీనిలోని సభ్యులందరూ ఉద్యోగం చేసేవారు అయిన, కూలీ పనులు చేసేవారు అయిన నెలకు వారికి తోచినంత ఇస్తు పేదరికంలో ఉన్నవారికి సహాయం చేద్దాం అనుకునే మనస్తత్వం కలిగినవారు ఇలాంటి సేవా కార్యక్రమాలలో మీరు కూడా పాలుపంచుకోవాలి అని అనుకున్న వారు 9701952969, 7901167397 ఫోన్ నంబర్లను సంప్రదించి మీ అమూల్యమైన సహాయ సహకారాలు అందించవచ్చు.
పోతుగంటి సంపత్ కుమార్
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (నిజం న్యూస్)