యుద్ధం ఎఫెక్ట్… భగ్గుమన్న నూనె ధరలు!

రోజుల్లో కిలో రూ 20-.40 వరకు పెరుగుదల
పల్లి నూనె కంటే ఎక్కువ ధర పలుకుతున్న సన్ఫ్లవర్ ఆయిల్.
పలు చోట్ల నోస్టాక్ బోర్డులు.
విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడటమే కారణం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎఫెక్ట్ కారణమా?
దేశం ముందు జాగ్రత్తలు తీసుకోక పోవడమే, కారణమంటున్న నిపుణులు.
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై, చర్యలు లేనట్లేనా.
తుంగతుర్తి, మార్చి 6, నిజం న్యూస్
మన దేశానికి ఏటా 22మిలియన్ టన్నులు, రాష్ట్రానికి72లక్షలటన్నుల వంట నూనె అవసరం. దేశంలో ఏడు మిలియన్ టన్నులు
రాష్ట్రంలో 21,5లక్షల టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దేశానికి అవసరమైన మిగతా 15మిలియన్ టన్నుల నూనెలను విదేశాల
నుంచి దిగుమతి చేసుకుంటున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ ఉత్రెయిన్ నుంచిపామాయిల్ ,మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
భారీగా పెరిగిన నూనెల ధరలు…
ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఇప్పటివరకు (12రోజుల వ్యవధిలో) వంట నూనెల దరలు విపరీతంగా పెరిగాయి. పిబ్రవరి 208 ముందు కిలో రూ.135 ఉన్న సన్ఫప్లవర్ ఆయిల్ ధరప్రస్తుతం రూ.175కు పెరిగింది. అది కూడా పాతస్టాక్ ఉన్నవారేవిక్రయిస్తున్నారు. కొత్త స్టాక్ రావడం లేదని డీలర్లు చెబుతున్నారు. డీలర్లకు రోజూ యాప్ ద్వారా ధరలు అప్డేట్ అవుతుంటాయి. ఈ నెల
నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ నో స్టాక్, నో రేటు అని యాప్లో పెడుతున్నారని డీలర్లు చెబుతున్నారు.
రైతులను ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం లేక రైతులు నూనె గింజలపంటల సాగుపై దృష్టి సారించడం లేదు. దేశంలో ఒకటి, రెండు రాష్ట్రాలంత కూడా లేని ఉక్రెయిన్, మలేషియా,ఇండోనేషియా లాంటి చిన్న
దేశాలు వాటి అవసరాలు తీర్చుకోగా, విదేశాలకు నూనెలు ఎగుమతిచేస్తు న్నాయి. వ్యవసాయక దేశమైన మన దగ్గర మాత్రం ఇక్కడి
ప్రజల అవసరాలకు సరిపడా నూనెలను ఉత్పత్తి చేసుకోలేక విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి పాలకుల నిర్లక్యమే కారణమ
ని నిషుణులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే పామాయిల్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా, వేరుశనగ, సన్ఫ్లవర్, నువ్వులు తదితర నూనె
గింజల పంటల సాగును మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనాఉక్రెయిన్-రష్యా దేశాల యుద్ధంతో మన దేశంలో తలెత్తిన వంట నూ
నెల మంటల ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకునినూనెలునూనెగింజలసాగునుప్రోత్సహించాలని ప్రజలు , పార్టీ నాయకులు, కోరుతున్నారు.,
నూనె ధరలు ఇలా
నూనెలు. ఫిబ్రవరి 20కి ప్రస్తుత. ప్రస్తుత ధర (కిలో)
ముందు ధర(కిలో)
పామాయిల్ రూ.125 రూ.160
వేరుశనగ నూనె రూ.135 రూ.165
రైస్ బ్రాండ్ ఆయిల్. రూ.140 రూ.155
నువ్వుల నూనె రూ.150 రూ.165
గడిచిన, 10రోజుల్లో నూనెల ధరలు బాగా పేరిగాయి. ఏది ఏమైనా ఒక ప్రక్క యుద్ధం కారణంగా దిగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారస్తులు లాభార్జన తో డీలర్లు, మిల్లు యాజమాన్యం, కిరాణం షాపులో వ్యాపారస్తులు ఎక్కువ నిల్వలు పెంచి, కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచడంతో, సామాన్యునికి భారంగా మారాయి, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విజిలెన్స్ అధికారులతో దాడులు నిర్వహించి, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై , శాఖ పరమైన చర్యలు తీసుకొని, పెరుగుతున్న ధరలకు, తాళం వేయాలని, ప్రజలు, మేధావులు కోరుతున్నారు.