మిడ్ మానేర్ నిర్వాసితులపై ఎందుకంత వివక్ష

మిడ్ మానేర్ నిర్వాసితులపై ఎందుకంత వివక్ష
రాజన్న సిరిసిల్ల, మార్చి05 (నిజం న్యూస్):
మంత్రి కేటీఆర్ వేములవాడ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా మిడ్ మానేర్ ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించకుండా ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్యగా మిడ్ మానేర్ ముంపు గ్రామాల ఐక్యత వేదిక ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ పుట్టిన గ్రామం చింతమడక కు 10 లక్షలు ఇస్తారు. కేటీఆర్ కు నచ్చిన ప్రాజెక్టులలో కుటుంబ ప్యాకేజ్ 12 లక్షల 50 వేలు ఇస్తారు. నీకు నచ్చిన ప్రాజెక్టులలో యువతకు 5.లక్షల4000 ఇస్తారు. కానీ మిడ్ మానేరు గ్రామాలకు ఎందుకు ఈ వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
వేములవాడ పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం ఐదు లక్షల 4 వేల ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి ఉపాధి మార్గాలు చూపాలి, యువతకు పరిహారం ఇప్పించాలి, గ్రామంలో లేరని తొలగించబడిన కుటుంబాలను రీ గెజిట్ చేసి పట్టా పరిహారం ఇవ్వాలి, పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా యువతకు రెండు లక్షల పరిహారం, ఇండ్ల పరిహారం, ఇంటి అడుగు జాగల పరిహారం, పట్టా భూముల పరిహారం వెంటనే ఇవ్వాలనీ, వేములవాడ అర్బన్ మండలం ముంపు గ్రామాలను విటిడిఎ పరిధి నుంచి తొలగించాలి, ఇచ్చిన ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా సర్క్యులర్