Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చిన్న చిన్న గ్రామాలకు కూడా పెద్ద మొత్తంలో నిధులు..కేటీఆర్

ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటన

– అభివృద్ధి పనులను ప్రారంభించిన: కేటీఆర్

-చిన్న చిన్న గ్రామాలకు కూడా పెద్ద మొత్తంలో నిధులు: మంత్రి కేటీఆర్

ఎల్లారెడ్డిపేట, మార్చి 5,( నిజం న్యూస్):

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో శనివారం రోజున మంత్రి కేటీఆర్ పర్యటించారు.

చిన్న చిన్న గ్రామాలకు కూడా పెద్ద మొత్తంలో నిధులు

ఎల్లారెడ్డిపేట మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామంలో 27.5 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం,12 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్న గ్రామాలకు కూడా అభివృద్ధి కోసం అధిక నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో పోతిరెడ్డి పల్లి లో సెల్ఫోన్ సిగ్నల్ కూడా లేని పరిస్థితి ఉండేదని,ప్రస్తుతం పాఠశాల అదనపు గదులు గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసినట్లు వివరించారు. గ్రామానికి 5 కోట్ల రూపాయలతో రహదారులు వైకుంఠ గ్రామాలు నిర్మించినట్లు మంత్రి తెలిపారు.

అలాగే వెంకటాపూర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన రైతు వేదికను,10 లక్షలతో ఏర్పాటుచేసిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణం ను ప్రారంభించారు.

లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు:

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ 40 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ…

రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ముందుకు పోతోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగింది. రాజ‌కీయం, ప్ర‌జాజీవితంలో సంతోషం ఎక్క‌డ అనిపిస్తుందంటే.. ఇది పేద‌వాడి ప్ర‌భుత్వ‌మ‌ని సునీత చెప్పిన‌ప్పుడు సంతోష‌మేసింది. అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయి. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించి ఇస్తున్నాం.

మీరు ప‌రిపాలించే రాష్ట్రంలో ఇలాంటి ఇండ్ల‌ను నిర్మించారా? అని బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్ష‌న్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుపై చ‌ర్చ‌కు మీరు ఏ ఊరికి ర‌మ్మంటే ఆ ఊరికి వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు. మాట‌లు చెప్ప‌డం ఈజీ.. ప‌నులు చేయ‌డం క‌ష్టం.. విమ‌ర్శ చేయ‌డం అల‌క‌. విమ‌ర్శ‌లు చేసే ముందు ఏం చేశారో చెప్పాలి. ప్ర‌తి గ్రామంలో ఆశించినంత అభివృద్ధి జ‌రుగుతోంది. స‌ర్కార్ హాస్పిట‌ల్లో రోగుల సంఖ్య పెరిగింది. వెంక‌టాపూర్ కూడా అభివృద్ధి బాట‌లో ముందుకెళ్తోంది. సిరిసిల్ల రూపుమార్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆయన వెంట నేస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జెడ్పి చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పెళ్లి రేణుక, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

పరామర్శ:

వెంకటాపూర్ గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజు అనే టీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా, స్వయంగా వారి ఇంటికి వెళ్లి పార్టీ ఇన్సూరెన్సు చెక్కును వారి కుటుంబీకులకు మంత్రి కేటీఆర్ అందజేశారు.

ఆవిష్కరణ:

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ రాక ముందు నీటి కోసం పడ్డ కష్టాలు తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ పాలనలో ప్రాజెక్ట్ లు నిర్మించి తెలంగాణ ను సస్యశ్యామలం చేసిన సందర్భన్ని షాట్ ఫిలిమ్ ద్వారా జై తెలంగాణ_జయహో కేసిఆర్ పాలన అనే సీడీని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో షాట్ ఫిలిమ్ లో నటించిన నటులను ,నటీమణులను మంత్రి కేటీఆర్ ,జిల్లా అధ్యక్షులు తోట అగాన్న, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక అభినందించారు. ఈ కార్యక్రమంలో

షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ సింగారం దేవరజ్ అధ్వర్యంలో ,(నటీమణి)పందిర్ల నాగరాణి,(నిర్మాత) సింగారం మధు , కొర్రి అనిల్,మూలిగే ప్రమోద్,గణగోని తిరుపతి, ఇమ్మడి బాబు, యదా శ్రీనివాస్,మంగొలి శ్రీనివాస్,గణగొని బంటి,అవునురి పర్షరములు,బేబీ హాసిని (కెమెరా) బాబు తదతరులు పాల్గొన్నారు.

-ముందస్తు అరెస్టులు

మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎల్లారెడ్డిపేట లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తానని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని మార్చారన్నారు. వెంకటాపూర్ గ్రామంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి వినతిపత్రం అందజేశారు.