హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం

నిజామాబాద్ బ్యూరో,మార్చి 05(నిజం న్యూస్):
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ శనివారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథిగృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి సునీత,కలెక్టర్ నారాయణ రెడ్డి పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు,కలెక్టర్లు చంద్రశేఖర్,చిత్రమిశ్రా ఉన్నత అధికారులు న్యాయ శాఖ అధికారులు న్యాయవాదులు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించారు అనంతరం జిల్లా జడ్జి,కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథిగృహంలో కొద్దిసేపు సమావేశం అయ్యారు అంతకుముందు ఆయన పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు