రాష్ట్ర స్థాయి జాతరగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తా..మంత్రి జగదీష్ రెడ్డి

-వచ్చే సంవత్సరం నాటికి ఎద్దుల పందేలు కోర్టు తెప్పిస్తా
-విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
మేళ్లచెరువు మార్చి 5 ( నిజం న్యూస్ )*. మేళ్లచెరువు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయం ఐదు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్లు జగదీశ్వర్ రెడ్డి శనివారం శివాలయంలో ఆలయ అధికారులు, దేవాలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పెద్ద జతల ఎద్దుల పందేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా గుర్తింపు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కి తెలియజేస్తానని వచ్చే సంవత్సరం శివరాత్రి నాటికి ఎద్దుల పందేల స్టేడియం, కోనేరు చూపిస్తామని అన్నారు. రైతులు ఉత్సహంగా ఉంటేనే మేము ఉత్సాహంగా ఉంటామని రైతులు వేల సంవత్సరాల నుండి సాంప్రదాయబద్ధంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారని వారు పశుపోషణ చేయడం గొప్ప విషయమని, రైతులు పశు పోషణ చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని చాలా విశేషమని అన్నారు. అనంతరం హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి తాను దేవాలయ అభివృద్ధికి కోటి రూపాయలకు పైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా ఎద్దుల పందేలు జరుగుతున్నాయని ఈ పందాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.