మరోసారి చిరుత.. రెండు దూడల పై దాడి

పరిగి మార్చి 5 నిజం న్యూస్

 

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామం లో మరోసారి కలకలం రేపిన చిరుత. చిల్ల లాలయ్య తండ్రి బాలయ్య అనే రైతు పొలం గట్టు దగ్గర కట్టేసి ఉన్న రెండు దూడల పై దాడి చేసింది. ఇలాంటి సంఘటనలు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోయిందని ప్రజల ఆందోళనకు దిగుతున్నారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరు అంటూ. రైతు ఆవేదన వ్యక్తం చేశాడు