గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..ఇద్దరు అరెస్టు.. కోర్టు రిమాండ్

*రెండు లక్షల విలువచేసే గుట్కా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం ఇద్దరు అరెస్టు కోర్టు రిమాండ్.,*
*నిషేదిత గుట్కాలమ్మితే పిడి యాక్ట్ బుక్ చేస్తాం.టూటౌన్ సిఐ సురేష్.*
మిర్యాలగూడ మార్చి 4 నిజం న్యూస్ మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం చెందిన నిషేధిత గుట్కా వ్యాపారి ,నేరస్తుడు ఆకుతోట నరసింహ తండ్రి లక్ష్మయ్య అనే వ్యక్తి సీతారాంపురం లోని వాసవి భవన్ రోడ్ లో లలితా కాంప్లెక్స్ లో ఒక సెంటర్ ని అద్దె తీసుకొని దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన రాయల ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వర్లు అనే అతని డ్రైవర్ గా పెట్టుకొని బీదర్ నుండి ప్రభుత్వంచే నిషేధింపబడిన ప్రజల ఆరోగ్యమునకు హాని కలిగించే గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి మిర్యాల పట్టణంలో అమ్ముతున్నారు. టి ఎస్ 05 యు డి 2508 నెంబర్ గల బొలెరో వాహనంలో తీసుకొని వచ్చి ఉండగా కట్టుబడి చేసిన పోలీసులు కేసు నమోదు చేయడమైనది. శుక్రవారం వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్కు పంప అయినదని మరియు వీరి వద్ద ఒక బొలెరో వాహనం రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నది చేసిన గుట్కా మరియు పొగాకు ఉత్పత్తుల విలువ సుమారు రెండు లక్షల కలదు, ఆకుతోట నరసింహ మీద ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్లో 10 కేసులు నమోదు అయి ఉన్నవి. ఇట్టి గుట్కా ఆకు ఉత్పత్తులు అమ్మిన వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి పిడియాక్ట్ బుక్ చేస్తామని మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు.