విద్యుత్ ప్రమాదం లో సబ్ స్టేషన్ ఆపరేటర్ కు తీవ్ర గాయాలు

విద్యుత్ ప్రమాదం లో సబ్ స్టేషన్

ఆపరేటర్ కు తీవ్ర గాయాలు.

ఆత్మకూరు ఎస్ మార్చి 4( నిజం న్యూస్):

విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందని ఫీజ్ ప్రాబ్లమ్ సరి చేసేందుకు సబ్ స్టేషన్ లో స్తంభం పై పని చేస్తున్న ఆపరేటర్ కు షాక్ తగిలిన ప్రమాదం లో శుక్రవారం సాయంత్రం తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలపరిధిలో ని పాతర్లపాడ్ లో గల విద్యుత్ సబ్ స్టేషన్ లో గంధం రాజేష్ రెడ్డి గత 5ఏళ్ళు గా ఇదే సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 3ఫెజ్ లైన్ సప్లై బంద్ చేసి సింగిల్ ఫెజ్ సప్లై ఇచ్చేందుకు మార్చగా సప్లై లో అంటరాయం ఏర్పడింది. వెంటనే ఫీజ్ పోయినట్లు గమనించిన ఆపరేటర్ రాజేష్ రెడ్డి సబ్ స్టేషన్ లో av స్విచ్ బంద్ చేశాడు. లైన్ బంద్ చేసినప్పుడు పవర్ ట్రాన్సఫార్మర్ పై న ఉన్న 3పత్తులు సప్లై నుండి వేరు అవుతాయి. అందులో ఒక పత్తి వేరు కాకుండా సప్లై లైన్ కు అనుకున్నది గమనించక నె స్తంభం ఎక్కి ఫీజ్ వేసే క్రమం లో సరిగా వేరుగాని సప్లైకి అనుకోవడం తో విద్యుత్ సరఫరా అయి షాక్ తగిలింది. అప్పుడే సబ్ స్టేషన్ కు రావాల్సిన సప్లై సూర్యాపేట లో ఆగిపోయింది దాంతో రాజేష్ రెడ్డి తీవ్ర గాయాలు తో ప్రాణాపాయం నుండి తప్పించు కో గలిగారు. వెంటనే సమీపం లో ఉన్న వారు రాజేష్ రెడ్డి ని ఆటో లో సూర్యాపేట కు తరలించారు. నెమ్మికల్ వద్ద కు రాగానే అంబులెన్సు రావడం తో అందులోకి రాజేష్ రెడ్డి ని అందులోకి మార్చి చికిత్స నిమిత్తం ప్రయివేటు హాస్పిటల్ కు తరలించినట్లు విద్యుత్ లైన్ ఇన్సిపెక్టర్ తిరుమలరెడ్డి తెలిపారురాజేష్ రెడ్డి కి కాలుకు చేతికి గాయాలు అయ్యాయి.3ఏళ్ల క్రితం సబ్ స్టేషన్ లో అప్పటి నుండి మెటీరియల్ మార్చక పోవడం తో తుప్పు పట్టి ప్రమాదం సంభవించి ఉండవచ్చునని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.