ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ట్రాన్స్ కో ఏడిఈ భద్రయ్య

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ట్రాన్స్కో డి ఈ భద్రయ్య

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం బాధితుడు సదరు ట్రాన్స్కో కాంట్రాక్టర్ కు సంబంధించిన మూడు లక్షల రూపాయల బిల్ రిలీజ్ చేయడానికి సదరు కాంట్రాక్టర్కు 20 వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది, సదరు కాంట్రాక్టర్ దీనిని 18 వేల రూపాయలకు ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఈ విషయమై సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది, వారి ఆధారంగా ఈ రోజు మధ్యాహ్నం పథకం ప్రకారం సదరు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ డి ఈ నివాసం వద్దకు వెళ్లి అట్టి రూపాయలు ముట్ట చెప్పడం జరిగింది, అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది, అట్టి రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకొని డిఈ నివాసం వద్ద సోదాలు నిర్వహించడం జరిగింది, విచారణ అనంతరం పూర్తి వివరాలను అందిస్తామని డీఎస్పీ ఏసీబీ అధికారులు ఆనంద్ తెలిపారు.