నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

గ్రామ పంచాయతీలలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి.
– స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ
మిర్యాలగూడ,దామరచర్ల మార్చి 4.
(నిజంన్యూస్): గ్రామ పంచాయతీలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించారానున్న వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామ పంచాయతీలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ,దామరచర్ల మండలంలో పలు గ్రామాల్లో రోడ్లపై ఉన్న మొక్కలను అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ చౌహన్, మిర్యాలగూడ ఎంపిడిఒ గార్లపాటి జ్యోతిలక్ష్మి,దామరచర్ల ఎంపిడిఒ కృష్ణమూర్తి లతో కాలసి పలు గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా రాహుల్ శర్మ మాట్లాడుతూ, మొక్కలకు సరిపడా నీరు అందిస్తూ, మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని కోరారు. ఈ పరిశీలనలో ఏడి నాగలక్ష్మి,ఎపివోలు,ఎంపివోలు ,కార్యదర్శులు ,టిఎ లు..వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.