పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

-ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లా ప్రతినిధి మార్చి 4 నిజం న్యూస్
ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఖమ్మం నగరం లోనీ తెలంగాణ తల్లి సర్కిల్లో చోటు చేసుకుంది. ఖమ్మం రఘునాధపాలెం మండలం కేంద్రానికి చెందిన మౌనిక, అదే గ్రామానికి చెందిన వీరబాబు గత కొన్ని ఏళ్ళు గా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేశారు.కొంతకాలం బాగానే ఉన్నా,ఇప్పుడు అతను తనను వద్దు అంటున్నాడని యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించింది.టూ టౌన్ పోలీసులు యువతికి నచ్చచెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.