జీతాలు ఫుల్లు ……బోధన నిల్!
– వెలుగు పల్లి హై స్కూల్ లో గణిత ఉపాధ్యాయుడు రత్నాకర్ ఘనకార్యం తో… వెనుకబడ్డ విద్యార్థులు, – లబోదిబోమంటున్న తల్లిదండ్రులు,
– సాక్షాత్తూ మండల విద్యాధికారి పనిచేస్తున్న, పాఠశాలలోనే జరిగిన వైనం.
ఉపాధ్యాయుడి పనితీరుపై , చర్యలు తీసుకోవాలని విద్యార్థులు , తల్లిదండ్రులు వేడుకోలు.
తుంగతుర్తి, మార్చి 4 ,నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ, విద్యార్థుల అభివృద్ధి దిశలో ప్రయత్నిస్తున్న తరుణంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి హై స్కూల్ లో ఓ గణిత ఉపాధ్యాయుడు నెల రోజుల తరబడి, పదవ తరగతి గణితంలో ఇంగ్లీష్ మీడియం లో బోధన చేయకపోవడంతో విద్యార్థులు తాము పరీక్షలు ఏమి రాయాలని, ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
మండల పరిధిలోని కి వెలుగు పల్లి హైస్కూల్లో సాక్షాత్తు మండల విద్యాధికారి బోయిన లింగయ్య ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నాడు. మండలంలో లోని పాఠశాలలో అభివృద్ధిపై తనిఖీ చేసి, విద్యార్థులను అభివృద్ధిలో రాణించే బాధ్యత, పాఠశాలలో ఉపాధ్యాయులు పని చేస్తున్నారా లేదా అని చూసుకునే బాధ్యత కూడా ఈ సార్ దే, మరి ఏం చేస్తున్నాడో అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు…
ఒక్కొక్క ఉపాధ్యాయునికి ప్రభుత్వం లక్షల రూపాయల జీతాలు ఇచ్చినప్పటికీ ,ఈ విధంగా ఉపాధ్యాయుడు రత్నాకర్ పదవ తరగతి విద్యార్థుల పై నిర్లక్ష్యాన్ని పూర్తిగా ప్రదర్శించి , ఇష్ట రాజ్యముతో, బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ, మండల విద్యాధికారి ఎందుకు ప్రశ్నించలేదు, విద్యార్థులు పరీక్షల్లో ఏమి రాయాలి, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా జరిగిన సంఘటనపై ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ, పదవ తరగతి గణితం బోధించ పోకడపై, పూర్తి నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడు పై, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా విచారణ జరిపించి,. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ,వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు.