అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసే ఇసుక దందా

అక్రమ ఇసుక దందా!
అధికారులు, ప్రజాప్రతి నిదులు కుమ్మక్కు, అక్రమ ఇసుక దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
సూర్యాపేట, మార్చి 3:(నిజం న్యూస్ )
అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కుఅయి అక్రమ ఇసుక దందా నడుపుతూ.. లక్షలు సంపాదిస్తున్నారు.
, సూర్యాపేట జిల్లా ,నూతనకల్ మండల పరిధిలోని బికుమళ్ళ గ్రామ శివారులోని పాలేరు వాగు నుండి ప్రతి రోజు వందల ట్రాక్టర్ల ఇసుకను జేసీబీ ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ యజమానులు ఒక్కో ట్రాక్టర్ కు 50వేలు వసూలు చేసినట్లు పలువురు విమర్శిస్తున్నారు. ప్రతి నెల పోలీస్, రెవిన్యూ శాఖ అధికారులకు లంచాలు ఇస్తున్నట్లు బహిరంగంగా చెపుతున్నారు. వాగు ప్రక్కన ఉన్న రైతులను బెదిరించి ఇసుక తరలిస్తున్నారు .సీసీ రోడ్లకు అనుమతులు లేకుండానే ఇసుక తరలించిన అధికారులు పట్టించు కోవడం లేదని వాపోతున్నారు .గ్రామస్తులు అధికారులకు తెలియ జేసిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .జిల్లా ఉన్నతాధి అధికారులు స్పందించి ఇసుకాసురులు , అవినీతి అధికారుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.