12 ట్రాక్టర్లు పట్టుకున్నా తీరు మారలే

యదేచ్ఛగా ఇసుక తరలింపు
పాలకీడు మండలంలో ఇసుక దందా
పాలకీడు, మార్చి 03( నిజం న్యూస్) పాలకీడు మండలంలో ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతుంది సుమారు వందకు పైగా ట్రాక్టర్లు తోటి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుక దందా చేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సమాచారం నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ వలపన్ని 12 ట్రాక్టర్లు పట్టుకున్నారు మరికొన్ని ట్రాక్టర్లు ఫోన్ సమాచారం తోటి దారి మళ్ళించడం జరిగినప్పటికీ రోజు యదేచ్ఛగా తిరుగుతున్న డాక్టర్లు కళ్లముందు కనిపిస్తున్న పట్టించుకోని అధికారులు స్పెషల్ పార్టీ వారు వచ్చి పట్టుకునే వరకు ఏం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి జిల్లా యంత్రాంగం వచ్చి ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో మళ్లీ అదే ఇసుక దందా కొనసాగుతుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు