మండలాల గణాంక వివరాలు, వర్షపాతం, టెంపరేచర్ వివరాలు అందించడంలో నాణ్యత పెంచుకోవాలి

– అధికారులకు సూచన….. జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 3(నిజం న్యూస్)
మండలాల గణాంక వివరాలు, వర్షపాతం, టెంపరేచర్ వివరాలు ఎప్పటికప్పుడు అందించడంలో నాణ్యత పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అధికారులను సూచించారు.గురువారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో తెలంగాణ ఎకనామిక్ సబార్డినేట్ అసోసియేషన్ సంబంధించి 17 మంది మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, నలుగురు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ లకు కలెక్టర్ ఫండ్ నుండి ల్యాప్ ట్యాప్ లను పంపిణీ చేశారు. అలాగే తెలంగాణ ఎకనామిక్ స్టాటిస్టికల్ సబార్డినేట్ అసోసియేషన్ డైరీలను విడుదల చేశారు.కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్య నాయక్, తెలంగాణ ఎకనామిక్ స్టాటిస్టికల్ సబార్డినేట్ అసోసియేషన్ అధ్యక్షులు హరికృష్ణ, తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు ఉపేందర్రెడ్డి, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు జగన్, తెలంగాణ ఎకనామిక్ స్టాటిస్టికల్ సబార్డినేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అనిల్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీమతి రాజ్యం, స్టాటిస్టికల్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.